సిద్దవటం : సిద్దవటం రేంజ్‌లోని కడప–బద్వేల్ ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి చిరుతపులి సంచరించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రధాన రహ దారి నుంచి అడవిలోకి వెళ్తున్న చిరుతను చూసిన వాహనదారులు తీవ్ర భయాందోళన చెందారు. వాహనదారులు రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. లంకమల అభయారణ్యంలో వన్యప్రాణులున్న విషయం తెలిసిందే.
కడప ఎడ్యుకేషన్: విద్యాహక్కుచట్టం (ఆర్‌టీ ఈ 12.1 సి) కింద రెండు విడతలో జిల్లాకు 254 సీట్లు లాటరీలో కేటాయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ తెలిపారు. 1 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో 254 మందికి అడ్మిషన్లు లభించాయన్నారు. ఎంపికై న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌లకు మెసేజ్‌ల ద్వారా సమాచారం పంపినట్లు తెలిపారు. ఈ నెల 17లోగా ఎంపికై న విద్యార్థులు ఆయా పాఠశాలల్లో అడ్మిషన్‌లు పొందాలని సూచించారు. ఆయా ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోకుంటే చర్య లు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంఈఓలు చర్యలు తీసుకుని అడ్మిషన్ గడువు తేదీలోపు పూర్తి చేయాలని డీఈఓ ఆదేశించారు.
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్) ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు కడప నగరంలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుందని యోగి వేమన విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి. లక్ష్మి ప్రసాద్ తెలిపారు. యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థుల సౌకర్యార్థం ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఈనెల 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు సైకాలజీ సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభవుతాయని పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో ప్రతి రోజు 3 సెక్షన్లలో ఉదయం 9 గంటలకు, మధ్యా హ్నం 12:30 గంటలకు సాయంత్రం 4 గంటలకు పరీక్షలు సబ్జెక్టుల వారీగా ఉంటాయన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లలోని సమయాన్ని గమనించి సకాలంలో హాజరుకావాలని సూచించారు. కేఎస్‌ఆర్‌ఎం కళాశాల కేంద్రంగా నాలుగు రోజులపాటు జరిగే పరీక్షలకు 859 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు.
కడప సెవెన్‌రోడ్స్: దేశ స్వాతంత్య్రం కోసం చిన్న వయస్సులోనే ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావా లని ఇన్‌చార్జి డీఆర్వో వెంకటపతి అన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు వర్దంతిని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన అల్లూరి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఆర్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


