రేషన్‌కార్డుదారులు ఈ–కేవైసీ చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డుదారులు ఈ–కేవైసీ చేసుకోవాలి

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

రేషన్‌కార్డుదారులు ఈ–కేవైసీ చేసుకోవాలి

జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లాలోని రైస్‌ కార్డుదారులలో ఇంకా ఈ–కేవైసీ పూర్తి చేయించుకోని సభ్యులు వెంటనే తమ సమీపంలోని రేషన్‌ దుకాణ డీలర్‌, స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఈ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటికీ మొత్తం 39,104 మంది ఈ–కేవైసీ పూర్తి చేయించుకోలేదని, అందులో అత్యధికంగా కడప నియోజకవర్గంలో 7,633 మంది, ప్రొద్దుటూరులో 4,297 మంది, రాజంపేటలో 3,029 మంది ఈ–కేవైసీ చేయించుకోవలసి ఉందని వివరించారు. అందువల్ల జిల్లాలోని అన్ని తహశీల్దార్లు, సీఎస్‌డీటీలు తమ పరిధిలోని వీఆర్వోలు, రేషన్‌ దుకాణ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, పెండింగ్‌లో ఉన్న ఈ–కేవైసీలను ఈ–పోస్‌ లేదా జీఎస్‌డబ్ల్యూఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా త్వరితగతిన పూర్తి చేయించవలసిందిగా ఆదేశించామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement