వేముల : రోడు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన వేముల సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన జయపాల్‌రెడ్డి, గంగన్నలు ద్విచక్రవాహనంలో పులివెందులలో జరిగే వివాహానికి బయలుదేరారు. వీరు వేములకు సమీపంలోని చెరువు కట్ట వద్దకు రాగానే వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జయపాల్‌రెడ్డి (65) మృతి చెందగా, గంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు శివమోహన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.


