చోరీ కేసులో ఇద్దరు దొంగలు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఇద్దరు దొంగలు అరెస్ట్‌

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారులోని ఇందిరానగర్‌ కాలనీలో ఉ న్న సీతారాముని ఆల యంలో గత నెల 30న చోరీకి పాల్పడిన ఇద్ద రు నిందితులను రూర ల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చోరీ జరిగిన వెంటనే కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో రూరల్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, రాజులు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో చోరీకి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సుందరాచార్యుల వీధికి చెందిన పిట్టా బాలజి, అమృతానగర్‌కు చెందిన షేక్‌ ఇబ్రహీంలను గురువారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి గణపతి విగ్రహం, రూ.1500, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు వివరించారు.

ప్రభుత్వాసుపత్రిలో

మహిళా జూనియర్‌ అసిస్టెంట్‌పై దాడి

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ మహిళా జూనియర్‌ అసిస్టెంట్‌ పై అదే విభాగంలో పనిచేసే మరో జూనియర్‌ అసిస్టెంట్‌ దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. గురువారం వెలుగు చూసిన ఘటనపై బాధితురాలి కథనం.. ఆసుపత్రిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే నందిని పై అదే విభాగంలో పని చేస్తున్న మరో జూనియర్‌ అసిస్టెంట్‌ సాయి ఆస్పత్రి స్కానింగ్‌ రూములో అందరూ చూస్తుండగానే బుధవారం చేయి చేసుకున్నాడు. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యం అందించడంతో కోలుకుంది. దాడి వ్యవహారం ఆస్పత్రి ఆర్‌ఎంఓ రాధిక దృష్టికి వెళ్లడంతో మహిళా జూనియన్‌ అసిస్టెంట్‌ నందినితో పాటు మరో జూనియర్‌ అసిస్టెంట్‌ సాయిని చాంబర్‌ కు పిలపించి సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఏ వైనా వ్యవహారాలు ఉంటే అస్పత్రి బయట చూసుకోవాలే తప్ప ఇక్కడ కొట్టు కోవడాలు, బెదిరించడం చేస్తే కేసులు పెట్టాల్చి వస్తుందని హెచ్చరించి పంపేసిందనిఆస్పత్రి వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే జూనియర్‌ అసిస్టెంట్లు ఇద్దరూ గత కొంత కాలంగా సన్నిహితంగా ఉండేవారని తెలిసింది. ఇద్దరి మద్య ఏం జరిగిందో ఏమో కొట్టుకోవడం వెలుగులోకి రావడంతో అస్పత్రిలో వ్యవహారం తీవ్ర చర్చినియాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement