రాజంపేట వాసికి ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

రాజంపేట వాసికి ఉత్తమ డైరెక్టర్‌ అవార్డు

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

రాజంపేట టౌన్‌: దర్శకరత్న దాసరినారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవం సందర్భంగా ఈనెల 4వ తేదీ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజంపేట మండలం ఎస్‌.ఎర్రబల్లెకు చెందిన ఆదిత్య వంశీ బెస్ట్‌ షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ అవార్డును అందుకున్నారు. ఈవిషయాన్ని ఆయన మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. తన దర్శకత్వంలో రూపొందిన మధురం కదా బాల్యం, ఉత్తరం అనే షార్ట్‌ ఫిల్మ్‌లకు బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు వచ్చినట్లు తెలిపారు. మధురం కదా బాల్యం, ఉత్తరం షార్ట్‌ఫిల్మ్‌లకు కథను, లిరిక్స్‌ను ప్రముఖ లిరిక్‌ రైటర్‌ ఎండి.రఫి అందించారని పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఉరుసు

ఖాజీపేట: కులమతాలకతీతంగా అందరూ కలసికట్టుగా నిర్వహించుకునే నత్తడ్‌షా వలీ ఉరుసు ఉత్సవం వైభవంగా జరిగింది. ఖాజీపేటలోని అగ్రహారం గ్రామంలో జరిగే ఈ ఉరుసు మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా 5వ తేదిన ఉరుసు భక్తిశ్రద్ధలతో జరిగింది. దర్గా చుట్టు ప్రత్యేక దీపకాంతులతో ఆకర్షనీయంగా అలంకరణ చేశారు. దర్గాలోని మజార్‌ను పూలతో సుందరంగా అలంకరించారు. సర్వర్‌ ఖాన్‌ పేటలోని మసీదు నుంచి జెండాను తీసుకొచ్చారు.

ఆకట్టుకున్న ఖవ్వాలి

ఉరుసు ఉత్సవాన్ని పురస్కరించుకుని సర్‌ఫరాజ్‌సాబ్రి, మోహసీన్‌ చిష్టి చే నిర్వహించిన ఖవ్వాలి ఆకట్టుకుంది.

ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

చౌడేపల్లె: పుంగనూరు మండలంలోని అడవినాథనకుంట సమీపంలో గల ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లుకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మదన్‌మోహన్‌ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.మే 5వ తేదీ నుంచి మే 21 వ తేదీవరకు మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పాసైన వారు రెండేళ్ల కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఇంగ్లీషు మీడియంలో బోధిస్తామని, డిప్లొమో కోర్సు పూర్తిఅయిన తరువాత ఉన్నత విద్యతోపాటు ఉపాధి అవకాశాలు పొందే సౌకర్యం ఉందని వివరించారు.ఆసక్తి గల వారు 9381359956 నంబరులో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement