ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ప్రేమజంటకు అంతిమ వీడ్కోలు

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

ప్రేమజంట యోగీంద్రకుమార్‌ వర్మ, హేమశ్రీ (ఫైల్‌ ).. జంటగా అంత్యక్రియలు చేస్తున్న దృశ్యం

తెలిసీ తెలియని వయసు వారిది.. చూడగానే ఒకరినొకరిపై ఆకర్షణ కలిగింది.. మెల్లగా మాట కలిసింది.. ఆపై ప్రేమ చిగురించింది.. ఊహల్లో విహరించారు.. ఊసులెన్నో చెప్పుకున్నారు.. కలిసి జీవించాలని కలలుగన్నారు.. ఏమైందో.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఇద్దరి మధ్య మనస్పర్థ తలెత్తింది.. మాటల్లో తేడా వచ్చింది.. తెలియని సంఘర్షణ ఏదో ఆ లేత మనసును గాయపరిచింది. అంతే ..కలిసి జీవించాలనుకున్న వారే విడివిడిగా బలవన్మరణానికి ఒడిగట్టారు.. కన్నోళ్లకు కడుపుకోత మిగిల్చారు.. ప్రేమ జంట యోగీంద్రకుమార్‌, హేమశ్రీ విషాదగాథ ఇది. జీవితమంతా కలిసుందామనుకున్న ఆ ఇద్దరిని వారి తల్లిదండ్రులు కలిసి అంతిమసంస్కారాలు నిర్వహించారు. మంగళవారం చెన్నూరు గ్రామశివార్లలో పక్కపక్కనే సమాధి చేశారు. కాగా, అంత బాధలోనూ రిమ్స్‌ సమీపంలోని డాక్టర్‌ ఎల్‌.వి ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వారి సిఫారసు మేరకు యువకుడి తల్లిదండ్రులు కొడుకు నేత్రదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. – కడప అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement