కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల మొదటి సెమిస్టర్ (ఆనర్స్) పరీక్షల ఫలితాలను వీసీ రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో కులసచివులు ఆచార్య పి పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె ఎస్వీ కృష్ణా రావుతో కలిసి పరీక్షల వివరాలు వెల్లడించారు. బీఏలో 58.35 శాతం, బీబీఏలో 72.63 శాతం, బీసీఏ 51.74 శాతం, బీకాంలో 63.84 శాతం, బీఎస్సీలో 63.72 శాతం, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులో 53.50 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగ సహాయ అధికారులు డా. సుభోష్ చంద్ర, డా.గణేష్ నాయక్ పాల్గొన్నారు.
పదికి పది జీపీఏ సాధించిన ఎస్పీ డిగ్రీ కాలేజీ
జమ్మలమడుగు: యోగివేమన యూనివర్శిటి ప్రకటించిన డిగ్రీ పరీక్ష ఫలితాల్లో ఎస్పీ డిగ్రీకాలేజికి చెందిన విద్యార్థులు యూనివర్శిటిలో మొదటిర్యాంకులు సాధించినట్లు కాలేజి కరస్పాడెంట్ పాల నాగేశ్వరరెడ్డి అన్నారు. దువ్వూరి మౌనిక బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో బోటని విభాగంలో పదికి పదిపాయింట్లు, టి, ఈశ్వర సాహితి బీఎస్సీ బోటని విభాగంలో పదికి పది పాయింట్లు సాధించడంతోపాటు హుస్సేన్‌బీ కంప్యూటర్ సైన్సు విభాగంలో పదికి పది పాయింట్లు సాధించి యూనివర్శిటిలోనే మొదటి ర్యాంకు సాధించినట్లు వివరించారు.
పదికి పది పాయింట్లు సాధించిన మౌనిక, ఈశ్వర సాహితి, హుస్సేన్‌బీ


