పాలిసెట్‌లోనూ బాలికలదే హవా ! | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లోనూ బాలికలదే హవా !

May 6 2026 8:01 AM | Updated on May 6 2026 8:01 AM

జిల్లాలో 89.96 శాతం ఉత్తీర్ణత

119 మార్కులతో జిల్లా టాపర్స్‌గా

నిలిచిన నల్లమారు నాగసంతోష్‌,

టాస్ప గ్లోరీ హదస్సా

కడప ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌–2026 ప్రవేశ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో నూ బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఏప్రిల్‌ 25వ తేదీ జిల్లావ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 9410 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 8465 మంది ఉత్తీర్ణులై 89.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 5389 మందికిగాను 4775 మంది ఉత్తీర్ణులై 88.61 శాతం, బాలికలు 4021 మంది పరీక్ష రాయగా అందులో 3690 మంది ఉత్తీర్ణులై 91.77 శాతం ఉత్తీర్ణత సాధించారు.

జిల్లా టాపర్స్‌ వీరే...

పాలిసెట్‌ పరీక్షలో జిల్లా టాపర్స్‌గా నల్లమారు నాగ సంతోష్‌ 120 మార్కులకుగాను 119 మార్కులను సాధించగా, టాస్ప గ్లోరీ హదస్సా 120 మార్కులకు 119 మార్కులను, ఉట్ల వెంకట నాగ తనూష్‌ 118 మార్కులను సాధించి జిల్లా టాపర్స్‌గా నిలిచారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు సాధించి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం సాధించాలనేదే తన లక్ష్యమని జిల్లా టాపర్‌ నాగసంతోష్‌ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement