కడప అర్బన్: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం సీకేదిన్నె మండలం ఊటుకూరు వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ మేరకు కడపకు చెందిన శేఖర్ రెడ్డి అనే వ్యక్తి కడప నగరం చుట్టుపక్కల మండలాల నుంచి సేకరించిన ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఓ టీచర్ వాహనంలో రవాణా చేస్తుండగా తనిఖీ అధికారులు గుర్తించి ఈచర్ వాహనాన్ని సీజ్ చేశారు. 205 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డి తో పాటు డ్రైవర్ గూడూరు ప్రసాద్‌పై సికెదిన్నె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. శ్రీనివాసరెడ్డి, సీకే దిన్నె సీఎస్డీటీ పి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


