ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

కడప అర్బన్‌: ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమంలో వచ్చే అర్జీలకు చట్టపరిధిలో నాణ్యమైన పరిష్కారం చూపాలని ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారుల తో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నా రు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్‌ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 145 ఫిర్యాదులు పీఆర్‌ఎస్‌కు వచ్చాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ కె. ప్రకాష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement
 
Advertisement
Advertisement