ఒంటె వాహనంపై సంజీవరాయుడు | - | Sakshi
Sakshi News home page

ఒంటె వాహనంపై సంజీవరాయుడు

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

ఒంటె వాహనంపై సంజీవరాయుడు గృహనిర్మాణ పనుల్లో వేగం పెంచాలి హర్సిలీహిల్స్‌కు అదనపు బస్సులు ప్రశాంతంగా నీట్‌ ప్రవేశ పరీక్ష

రాజుపాళెం: మండలంలోని వెల్లాల పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఒంటె వాహనంపై సంజీవరాయస్వామి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో స్వాములను పల్లకీలో ఆశీనులను చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తుల గోవిందా నామస్మరణలతో ఆ ఆ ప్రాంతం మారుమోగింది. ఉభయదాతలైన పగిడాల వైఎస్సార్‌సీపీ నాయకులు కానాల బలరామిరెడ్డి, వెల్లాల ఆలయ మాజీ చైర్మన్‌ కానాల విజయలక్ష్మి, పగిడాల మాజీ సర్పంచ్‌ కానాల రాధా, దామోదర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి.. స్వాములకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. కార్యక్రమంలో ఈఓ వెంకటరమణ, సీనియర్‌ అసిస్టెంట్‌ రామమోహన్‌, భక్తులు పాల్గొన్నారు.

రాయచోటి టౌన్‌: గృహనిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, ఫౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గృహనిర్మాణ పనులపై చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణాల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి అందుతోందా..ఆర్థిక చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అని అధికారులను అడిగ తెలుసుకున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో మొత్తం 66,360 ఇళ్లకు 42,326 ఇళ్లు పూర్తయ్యాయని, దీంతో 64 శాతం పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే డివిజన్‌ వారిగా కూడా రాయచోటిలో 54శాతం, మదనపల్లెలో 67 శాతం,పీలేరులో 67శాతం అభివృద్ధి సాధించినట్లు వివరించారు. మిగిలిన పనులు సెప్టెంబర్‌ 26లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాయ చోటి ఆర్డీవో శ్రీనివాస్‌, జిల్లా హౌసింగ్‌ పీడీ రమేష్‌రెడ్డి , ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌కు ప్రతి శని,ఆదివారాల్లో అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్‌ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం వరకు ఐదు ట్రిప్పులు తిరుగుతాయన్నారు. మిగిలిన రోజులు యాధావిఽధిగా బస్సు సర్వీసు నడుస్తుందన్నారు. ఈ బస్సు సర్వీసు మల్లికార్జునసర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా హార్సిలీహిల్స్‌కు వెళుతుందన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి ఆర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌ యూజీ–2026) ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు ఉదయం 11 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్‌టీఏకి సంబంధించిన అధికారులు విద్యార్థులను పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. కడపలో 8, ప్రొద్దుటూరులో 2 కేంద్రాల్లో లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 2952 మంది అభ్యర్థులు పరీక్షల రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement