రాయచోటి: ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై అధికార పార్టీ నేతలు భౌతిక దాడులకు పాల్పడటం బాధాకరమని.దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం పచ్చమూకల దాడిలో గాయపడిన దశరథరామిరెడ్డిని వైఎస్సార్‌సీపీనాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వర్కర్లు పరామర్శించారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, రామాపురం మాజీ ఎంపీపీ జనార్దన్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఖా న్, పట్టణ మైనార్టీ నేత రియాజుర్ అహ్మద్‌లు గాయపడిన వారిని పరామర్శించారు.


