రెడ్డెమ్మ ఆలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం.

రిమ్స్‌లో గుర్తు తెలియని

మృతదేహం

కడప అర్బన్‌ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో ఈనెల 2వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (30)ని వైద్యం కోసం తీసుకుని వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్‌ అధికారులు తెలియజేశారు.

యువతి అదృశ్యంపై ఫిర్యాదు

మైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలుకు చెందిన బుచ్చిగారి నందిని అనే 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఆదివారం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిని తల్లి కువైట్‌కు వెళ్లింది. తండ్రి పుల్లయ్య ఉన్నాడు. యువతి తన మేనత్త సుభాషిణి సంరక్షణలో కొత్తకొట్టాలు ప్రాంతంలో ఉంటోంది. ఇటీవల కడపలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. శనివారం రాత్రి నుంచి తన మేనకోడలు కనిపించడం లేదని సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement