వివక్ష కాక మరేంటి...
ఖరీప్‌లో జిల్లావ్యాప్తంగా 20,715.57 ఎకరాల్లో ఉల్లిపంట సాగు చేస్తే ప్రభుత్వం మాత్రం 14,202.05 ఎకరాలకు మాత్రమే ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. ఇది వివక్ష కాక మరేంటి. మిగతా 6,513 ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేసిన రైతులు రైతులు కాదా. వారికి కూడా ప్రోత్సాహక నిధులను మంజూరు చేయాలి కదా. ఇప్పటికై నా వివక్షను వదిలి అందరి రైతులకు ప్రోత్సాహక నిధులను మంజూరు చేయాలి. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు


