నేడు ట్రాఫిక్‌ మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు

Apr 11 2025 1:27 AM | Updated on Apr 11 2025 1:27 AM

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు

నేడు ట్రాఫిక్‌ మళ్లింపు

కడప అర్బన్‌ : ఈ నెల 11న శుక్రవారం ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్‌ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా ఎస్‌.పి ఈ.జి అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్లింపు ఈ నెల 11 వ తేదీ ఉదయం నుంచి 12 వ తేది ఉదయం వరకు అమలులో ఉంటుందని తెలిపారు.

వాహనాల దారి మళ్లింపు వివరాలు..

● కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే వాహనా లు కడప నగరం అలంఖాన్‌ పల్లి ఇర్కాన్‌ జంక్షన్‌ నుంచి ఊటుకూరు సర్కిల్‌, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్లాలి.

● తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రాయ చోటి మీదుగా కడపకు చేరుకోవాలి.

● రాజంపేట వైపు నుండి కడప వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు. రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను సాలాబాద్‌ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా పంపిస్తారు.

18 చోట్ల పార్కింగ్‌ ప్రదేశాల ఏర్పాటు..

శ్రీ సీతారామ కల్యాణానికి రాజంపేట వైపు నుండి వచ్చే భక్తులు టూ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను సాలాబాద్‌ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 13 పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.

కడప రహదారి వైపు పార్కింగ్‌ ప్రదేశాల వివరాలు..

కడప వైపు నుండి ఒంటిమిట్ట వచ్చే భక్తుల కోసం 13 ప్రదేశాలలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

● ఫోర్‌ వీలర్స్‌కు జనరల్‌ పార్కింగ్‌ – చలమయ్య యాదవ్‌ సైట్‌..మాధవరం 1 (హెచ్‌ పి పెట్రోల్‌ బంక్‌ తూర్పు వైపున)

● త్రీ వీలర్స్‌కు పార్కింగ్‌ –కనకదుర్గ కళ్యాణ మండపానికి పడమటి వైపున మాధవరం1

● కార్‌ పార్కింగ్‌ – కనకదుర్గ కల్యాణ మండపం తూర్పు వైపున ...మాధవరం 1

● కార్‌ పార్కింగ్‌ – సన్నీ ఫుడ్‌ కోర్ట్‌ ఫ్యామిలి దాబా తూర్పు వైపు

● కార్‌ పార్కింగ్‌ – సన్నీ ఫుడ్‌ కోర్ట్‌ ఫ్యామిలి దాబా పడమటి వైపు

● ట్రాక్టర్‌లు, లారీల పార్కింగ్‌ – సన్నీ ఫుడ్‌ కోర్ట్‌ నుండి పడమటి వైపు సాయిబాబా గుడి, ఉప్పరపల్లి గ్రామం(ట్రాఫిక్‌ మళ్లింపు ప్రదేశం)

● కార్‌ పార్కింగ్‌– ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , కొత్త మాధవరం(ఫారెస్ట్‌ చెక్‌ పోస్ట్‌ ఎదురుగా)

● ఆర్‌.టి.సి బస్సుల పార్కింగ్‌ – శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, ఓబుల్‌ రెడ్డి వాటర్‌ ప్లాంట్‌/ స్పైసెస్‌ బోర్డు మధ్యలో

● ఫ్రీ బస్సులు, వి.ఐ.పి కార్‌ పార్కింగ్‌ – శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, రాయలసీమ హోటల్‌ (వి.వి.ఐ.పి – వి.ఐ.పి ఎంట్రెన్సు ఆర్చి ఎదురుగా)

● పోలీసు వాహనాల పార్కింగ్‌ –ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ – మయూర హోటల్‌ వెనుక వైపు

● ఇతర శాఖల వాహనాల పార్కింగ్‌ – ఈ ద్గా పక్కన, ఒంటిమిట్ట (కార్‌ పార్కింగ్‌)

● టి.టి.డి వాహనాల పార్కింగ్‌ –కల్యాణ వేదిక ప్రధాన ప్రవేశం ఆర్చ్‌ వద్ద ఉన్న సత్రం వద్ద

● టూ వీలర్‌, కార్‌ పార్కింగ్‌ – కల్యాణ రామ టౌన్‌ షిప్‌, బ్రిడ్జి పక్కన, దర్జిపల్లి రోడ్‌, కొత్త పల్లి గ్రామ సమీపంలో

రాజంపేట రహదారి వైపు పార్కింగ్‌ ప్రదేశాల వివరాలు

● ఆర్‌.టి.సి బస్సు పార్కింగ్‌ –సాలాబాద్‌ క్రాస్‌ వద్ద

● ఫోర్‌ వీలర్‌ , టూ వీలర్‌ పార్కింగ్‌–మదరసా, మలకాటి పల్లి గ్రామం.

● ఫోర్‌ వీలర్‌, టూ వీలర్‌ పార్కింగ్‌–మలకాటి పల్లి గ్రామం వద్ద.

● వి.ఐ.పి కార్‌ పార్కింగ్‌ –బి.సి బాయ్స్‌ హాస్టల్‌, ఒంటిమిట్ట టౌన్‌

● వి.ఐ.పి కార్‌ పార్కింగ్‌ – దుర్గమ్మ గుడి ముందు వైపు, ఒంటిమిట్ట టౌన్‌

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేపథ్యంలో నిర్ణయం

వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలి

జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement