కడప ఎడ్యుకేషన్ : ప్రొద్దుటూరు వేంకటేశ్వర డిగ్రీ, పీజీ ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు అటనామస్ గుర్తింపునకు నకిలీ పత్రాలు చూపి అక్రమాలకు పాల్పడ్డారని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు జగన్, నరసింహ, జగదీష్ ఓబులేసు, జయరాజు, ప్రతాపరెడ్డి, బయన్న ఆరోపించారు. వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మను గురువారం వారు తమ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. వారు మాట్లాడుతూ కళాశాల కరస్పాండెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా పాలకులు, అధికారులను మోసం చేస్తూ తప్పుడు ధ్రువ పత్రాలతో అక్రమ మార్గంలో గుర్తింపు పొందారని ఆరోపించారు. ఒక ఫీజు చెప్పి.. మరోలా ఫీజు రాబడు తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నా రు. యూనివర్సిటీ అధికారులు విచారణ జరిపి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బయన్న, దాసు, తదితరులు పాల్గొన్నారు.
వైవీయూ రిజిస్ట్రార్‌కు విద్యార్థి
యువజన నాయకుల ఫిర్యాదు