చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో త్వరలోనే అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు తెలిపారు. నూతనంగా మంజూరైన అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఏర్పాటు కోసం గురువారం చౌటుప్పల్‌లోని జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనంలోని బార్ అసోసియేషన్ చాంబర్.. కోర్డు హాలుకు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం అంగీకరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్, మాజీ అధ్యక్షులు ఎలమోని శ్రీనివాస్, బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు మక్తల నర్సింహ, జెల్ల రమేష్, ఎండి.ఖయ్యూం, పరమేష్, రవీందర్, కట్టెల లింగస్వామి, ఏఓ రామకోటి, చంద్రిక, అమర్‌బిన్ నాసిర్ పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు


