మోత్కూరులో భోగి బోనాలకు సిద్ధం
మోత్కూరు : సంక్రాంతిని మోత్కూరు పట్టణంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. భోగి రోజు ముది రాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. 2009లో బిక్కేరు సమీపంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ముదిరాజ్ కులస్తులు నిర్మించారు. అప్పటి నుంచి ఏటా వార్షికోత్సవాన్ని భోగి రోజున నిర్వహిస్తున్నారు. మహిళలు బోనాలతో ప్రదర్శనగా వెళ్లి పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పిస్తారు. సంక్రాంతి రోజు ముదిరాజ్‌లు కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళ్లడం సంప్రదాయం. భోగి రోజు గౌడ కులస్తులు కంఠమహేశ్వరస్వామికి తీపి భోనాలతో నైవేద్యం సమర్పించడం ఆచారం. ఇది రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. సంక్రాంతి రోజు వన మైసమ్మ, రేణుక ఎల్లమ్మ, గ్రామ దేవతలకు మేకపోతులు, కోళ్లు బలి స్తారు.


