19 నుంచి నూతన సర్పంచ్‌లకు శిక్షణ
భూదాన్‌పోచంపల్లి: భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు 19 నుంచి భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు జెడ్పీ సీఈఓ శోభారాణి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వారు గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ అధికారి రాఘవేంద్రరావుతో కలిసి స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థను సందర్శించారు. అక్కడ శిక్షణకు అందుబాటులో ఉన్న గదులు, భోజన సదుపాయాలు, రాత్రి బసచేయడానికి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికై న 421మంది సర్పంచ్‌లకు ఎంపీడీఓలు, ఎంపీఓలు నాలుగు విడతలుగా, ఒక్కో విడతలో ఐదు రోజుల పాటు పరిపాలనా అంశాలపై శిక్షణ ఇవ్వనన్నట్లు చెప్పారు. శిక్షణలో భోజనం, నివాస సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, ఎంఈఓ మాజిద్, ఏపీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


