జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
బొమ్మలరామారం : మండలంలోని మర్యాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శ్రేష్ట, శ్రావణి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి మంగళవారం తెలిపారు. ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ బాలికల ఖోఖో పోటీల్లో(అండర్–14) ఉమ్మడి జిల్లా తరఫున శ్రేష్ట, శ్రావణి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. వారిద్దరు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు రాజస్తాన్ రాష్ట్రంంలో జరగనున్న 69వ జాతీయ స్థాయి అండర్ 14 బాలికల ఖోఖో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను డీఈఓ సత్యనారాయణ, ఎంఈఓ రోజారాణి, సర్పంచ్ సంగి గణేష్, పాఠశాలల జిల్లా క్రీడల కార్యదర్శి కందాడి దశరథరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.


