సంబరాల సంక్రాంతి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సూర్యాపేట సమీపంలోని పలు హోటళ్లను నిర్వాహకులు పండుగ వాతావరణంలో ముస్తాబు చేశారు. సెవెన్ ఆర్ హోటల్‌లో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలను తలపించేలా ఎద్దుల బండి, ఎద్దులతో సెట్టింగ్ చేశారు. పట్టణంలో పతంగులు, చెరుకు గడలు, గొబ్బెమ్మల సామగ్రితో పాటు కలర్లను ప్రజలు కొనుగోలు చేస్తుండడంతో పండగ వాతావరణం నెలకొంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, సూర్యాపేట


