రెండు వైన్ షాపుల్లో చోరీ
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జాన్‌పహాడ్ రోడ్డులో పక్కపక్కనే ఉన్న రెండు వైన్ షాపుల్లో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. మంగళవారం ఎస్‌ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు వైన్ షాపుల సిబ్బంది సోమవారం రాత్రి దుకాణాలను మూసివేసి వెళ్లారు. మంగళవారం ఉదయం సిబ్బంది వచ్చి చూసేసరికి షట్టర్లు తెరిచి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయదుర్గా వైన్ షాపులో రూ.60వేల నగదు, రూ.4వేల విలువైన మూడు మద్యం బాటిళ్లు, శివాంజనేయ వైన్ షాపులో రూ.15వేల నగదు, రూ.2వేల విలువైన ఒక మద్యం బాటిల్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


