మతోన్మాద భావజాలం హానికరం
భువనగిరిటౌన్ : గ్రామాల్లో పెరుగుతున్న మతోన్మాద భావజాలం చాలా హానికరమని, దీనిని అణచివేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద భావజాల వ్యాప్తి అడ్డూఅదుపు లేకుండా పెరుగుతుందని, కులం, మతం పేరుతో మనుషుల మధ్య విషం నింపుతోందన్నాని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌లను సవరించడం, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా పేరు మార్చడం తగదన్నారు. విత్తన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని ఆలోచనలు చేయడమేనన్నారు. బీజేపీ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్నాయన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. బీజేపీ మతం, కులం పేరుతో చేస్తున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరీ, ఎండి పాష, బొడ్డుపల్లి వెంకటేష్, గుండు వెంకటనర్సు, దోడ యాదిరెడ్డి, మద్దేపూరం రాజు, బోలగాని జయరాములు, అవ్వారు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, ఎంఏ ఇక్బాల్, వనం ఉపేందర్, గడ్డం వెంకటేష్, మల్లేపల్లి లలిత, బల్గూరి అంజయ్య, కోట రామచంద్రారెడ్డి, గోశిక కరుణాకర్, మండల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు
బీవీ రాఘవులు


