నేటి నుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు
భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ బోర్డు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించిందని డీఐఈఓ రమణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 19వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆమె పేర్కొన్నారు.
పండుగ ముగిసే
వరకు విధులు
● ఎస్పీ అక్షాంశ్ యాదవ్
చౌటుప్పల్ : సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్తున్న ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే వరకు తాము విధులు నిర్వహిస్తామని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజాను శనివారం ఆయన సందర్శించారు. టోల్ ప్లాజా నిర్వాహకులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ రద్దీ నేపథ్యంలో జాతీయ రహదారిపై 150 మంది పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హైవేపై అంబులెన్సులు, క్రేనులు అందుబాటులో ఉన్నాయన్నారు. పండుగకు ఇంటికి వెళ్తున్నందున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపొద్దన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ఽ ధరించాలని, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన
భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు చెందిన నృత్య గురువు భారతిలక్ష్మీ శిష్య బృందం ఆధ్వర్యంలో భరత నాట్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్శకులను నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాకారిణిలు ఆరాధ్య, వైష్ణవి, హరిచందన, ప్రజ్ఞ, నిషిక, శాన్వి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు


