సంక్రాంతికి సాగు పనిముట్లు
పనిముట్ల పంపిణీ నిరంతర ప్రక్రియ
రామన్నపేట : వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై అందించే పనిముట్ల పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు ఈనెల 12 నుంచి పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 1.27కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద జిల్లాకు మంజూరు చేసిన 316 యూనిట్లను రైతులకు యాభైశాతం సబ్సిడీపై అందజేస్తారు.
1,150 దరఖాస్తుల స్వీకరణ
రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాత్రీకరణ పథకాన్ని గత ప్రభుత్వం 2016–17లో నిలిపి వేసింది. అయితే చిన్న సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఽఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం సాగు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మండలాల వారీగా యూనిట్లను కేటాయించి రైతుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. సుమారు 1,150 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాకు మంజూరైన 316 యూనిట్లకుగాను 177 యూనిట్ల పంపిణీ చేయుటకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలేరు నియోజకవర్గానికి మంజూరైన యూనిట్లను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఈనెల 12న ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సంబంధించిన యూనిట్లను పాటిమట్లలో ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు.
యాంత్రీకరణ పథకంలో రైతులకు అందించే
వ్యవసాయ పనిముట్లు
కేటాయించిన యూనిట్లు
సబ్సిడీపై రైతులకు యాత్రీకరణ పరికరాలు
జిల్లాకు 1.27 కోట్లు విడుదల
చేసిన ప్రభుత్వం
మొత్తం 316 యూనిట్లు మంజూరు
లబ్ధిదారులకు రేపటి నుంచి పంపిణీ
నియోజకవర్గం మంజూరైనవి పంపిణీ చేసేవి
ఆలేరు 142 70
భువనగిరి 84 62
మునుగోడు 34 12
నకిరేకల్ 20 06
తుంగతుర్తి 36 27
మంజూరైన పరికరాలు ఇవే..
పవర్ స్ప్రేయర్లు 100
రోటోవేటర్లు 98
కల్టివేటర్లు, కేజ్‌వీల్స్, డిస్క్‌హారోస్ 61
బండ్ ఫార్మర్ 04
పవర్‌వీడర్స్ 08
పవర్‌టిల్లర్లు 12
బ్రష్‌కట్టర్స్ 17
స్ట్రాబేలర్లు 15
సీడ్‌కం ఫర్టిలైజర్ డ్రిల్ 01
యాంత్రీకరణ పథకం కింద రైతులకు సబ్సిడీపై నిరంతరం పనిముట్లను పంపిణీ చేస్తాం. జిల్లాకు మంజూరైన 316 యూనిట్లకు గాను 177 యూనిట్లను ఎంపిక చేసిన రైతులకు ఎమ్మెల్యేల చేతుల మీద అందజేస్తాం. మిగిలిన యూనిట్లు కూడా త్వరలో పంపిణీ చేస్తాం. యాంత్రీకరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటరమణారెడ్డి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
సంక్రాంతికి సాగు పనిముట్లు


