స్థానికంగానే ఉంటున్నాం
ఇరవై ఐదేళ్లుగా 9వ వార్డులోని ఇందిరా వికలాంగుల కాలనీలో గుడిసెలు వేసుకుని మా కుటుంబ సభ్యులం 15 మంది వరకు ఉంటున్నాం. గతంలో ఓట్లు నమోదప్పుడు మా గుడిసెల పక్కనే ఉన్న ఇంటి నంబర్‌ను రాసుకున్నారు. అదే మా ఓటరు కార్డుపై వస్తుంది. ఈ విషయం అధికారులకు చెబితే మారుస్తామన్నారు.
– పెద్ద సమ్మయ్య, 9వ వార్డు, యాదగిరిగుట్ట
ఓట్లు తొలగించే అవకాశం మాకులేదు
ప్రస్తుతం ఓట్లు చేర్చడం, తొలగించడం మా పరిధిలో లేదు. మార్పులు, చేర్పులు వంటివి రెవెన్యూ శాఖ అధికారులు చేస్తారు. మున్సిపాలిటీలోని 9వ వార్డులో, 6వ వార్డులో ఒకే ఇంటిపై అధిక ఓట్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. దానిపై మా సిబ్బందితో విచారణ చేయిస్తున్నాం.రిపోర్టును కలెక్టర్‌కు సమర్పిస్తాం.
– లింగస్వామి, మున్సిపల్ కమిషనర్


