
అగ్రదేశాల సరసన చేరుతాం
నూతన ఆవిష్కరణలను స్వాగతిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. పది మంది చేసే పనిని ఏఐ టెక్నాలజీతో ఒక్కరే చేయవచ్చు. ఏఐ టెక్నాలజీని పనిని సులభతరం చేయడానికి వినియోగించాలి తప్ప.. ఉద్యోగులను తొలగించొద్దు.
–లక్ష్మణ్‌రెడ్డి, ఏఐఎంల్
మోదీ విజన్ వల్ల ప్రపంచంలో ఇండియా మూడో ఆర్థిక దేశంగా ఎదిగింది. వచ్చే 20 ఏళ్లలో వందశాతం పేదరిక నిర్మూలన జరగాలి. రిజర్వేషన్‌లను తొలగించి స్కిల్‌కు ప్రాధాన్యత కల్పించాలి. టాలెంట్, ఉపాధికి పెద్దపీఠ వేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక విద్యను ప్రోత్సహిస్తే స్కిల్ ఇండియా రూపొందుతుంది. –ఉజ్వల్, సీఎస్‌ఈ
భూదాన్‌పోచంపల్లి: ‘మారుతున్న కాలాగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ వివిధ రంగాల్లో రాణిస్తోంది యువత. స్కిల్ ఇండియాగా అవతరించి అగ్రదేశాల సరసన నిలిచే సామర్థ్యం మనకు ఉంది. అందుకు యువత మరింత కష్టపడాలి. వీటితో పాటు పరిశుభ్రత, ఆరోగ్యంపై గ్రామీణ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది’ అని భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వందేళ్ల భారతం ఎలా ఉండబోతుంది.. అందుకు మీ పాత్ర ఏమిటి’ అనే అంశంపై నిర్వహించిన సాక్షి టాక్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆటోమొబైల్‌లో రంగంలో ప్రంపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఆటోమొబైల్ రంగం నుంచే 7శాతం జీడీపీ వస్తుంది. విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం డెవలప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. –శశి, డేటా సైన్స్ ఇంజనీరింగ్
ఫ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అవకాశాలకు మరింత ప్రాధాన్యమివ్వాలి
ఫ పల్లెలకూ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తే ఎంతో ప్రయోజనం
ఫ ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ తప్పనిసరి
ఫ కఠిన చట్టాలున్నా మహిళలపై
అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి
‘సాక్షి’టాక్ షోలో ఇంజనీరింగ్ విద్యార్థుల మనోగతం

అగ్రదేశాల సరసన చేరుతాం

అగ్రదేశాల సరసన చేరుతాం

అగ్రదేశాల సరసన చేరుతాం

అగ్రదేశాల సరసన చేరుతాం