
పంద్రాగస్టు వేడులకు ముఖ్య అతిథిగా గుత్తా
సాక్షి, యాదాద్రి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర, జిల్లా ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 9.55 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.15కు ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శన, 10.25 గంటలకు ప్రశంస పత్రాల పంపిణీ ఉంటుంది. అనంతరం శాసనమండలి చైర్మన్‌తో పాటు ఎమ్మెల్యేలు, అధికా రులు, ఇతర ప్రముఖులు స్టాళ్లను సందర్శిస్తారు.
కలెక్టరేట్‌లో..
కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 8.30 గంటలకు కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతా కాన్ని ఆవిష్కరిస్తారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
రూ.5లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు అన్న ప్రసాదా నికి హైదరాబాద్‌కు చెందిన పుస్తె సత్యనారా యణ–సరళాదేవి దంపతులు రూ.5లక్షల వి రాళం అందజేశారు. గురువారం శ్రీస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మకు చెక్కు అందజేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: చందేపల్లి పరిధిలోని అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. అటెండర్, డే, నైట్ వాచ్‌మన్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. దరఖా స్తులను ఈనెల 22వ తేదీ లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 9441189894 నంబర్‌ను సంప్రదించాలన్నారు. అలాగే కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో 4 అకౌంటెంట్, 2 ఏఎన్‌ఎం పోస్టులకు అర్హులైన మహిళలు ఈనెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం సెల్ నంబర్ 9441189894ను సంప్రదించాలన్నారు.
పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సు
ఆత్మకూరు(ఎం): శ్రావణమాసం సందర్భంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు తొర్రూరు డిపో నుంచి స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. ఈ నెల 21వ తేదీ రాత్రి బయలుదేరి అన్నవరం, సింహాచలం, ఆర్‌కే బీచ్, సామర్లకోట, పిఠాపురం, 12వ శక్తిపీఠం, విజయవాడ, ఉండవల్లి గుహలు, శ్రీపరిటాల హనుమాన్ ఆలయం, పెనుగ్రంచిప్రోలులోని ఆలయాలను దర్శించుకుని 24న తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. చార్జి పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,300 నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 7032182456, 8074474894లను సంప్రదించాలని కోరారు.