
వరిలో విత్తన ఎంపిక అత్యంత కీలకం
● జేజీఎల్–24423(జగిత్యాల రైస్–1)
125 రోజుల పంట కాలం. సుడి దోమ, చలి, చౌడును కొంత వరకు తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 82 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● కెపీఎస్–6251(పీఆర్‌సీ)
పంట కాలం 115 నుంచి 120 రోజులు. అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు, సుడి దోమను కొంత వరకు తట్టుకుంటుంది. ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● కేపీఎస్–10329( చిరు సంచి స్థాయి)
వానాకాలం 120 నుంచి 125 రోజులు, యాసంగి 130 నుంచి 135 రోజుల పంట కాలం. దిగుబడి ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్లు వస్తుంది.
● కేపీఎస్–10631 ( చిరు సంచి స్థాయి)
వానాకాలంలో 120 నుంచి 125 రోజులు, యాసంగిలో 130 నుంచి 135 రోజులు. దిగుబడి 32 నుంచి 34 క్విటాళ్లు వస్తుంది.
త్రిపురారం : తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు. నారు మడులకు దుక్కి సిద్ధం చేసుకుంటున్నారు. వానాకాలంలో రైతులు విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు పాటించాలని, వరి పంటల సాగులో విత్తనాల ఎంపిక అత్యంత కీలకమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట చీడపీడలను తట్టుకొని దిగుబడులు పెరిగే రకాలు ఎంపిక చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొంటున్నారు.
మూడు రకాలుగా వరి విత్తనాలు
ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసుకోవడానికి అనువైన వరి వంగడాలు మూడు రకాలుగా ఉంటాయి. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక రకాలుగా లభ్యమవుతాయి. దీర్ఘ కాలిక రకం 150 రోజుల పంట కాలం కాగా జూన్ నెలాఖరు వరకు నాటుకోవాలి. మధ్య కాలిక రకం 135 నుంచి 140 రోజుల పంట కాలం కాగా జూలై 15వ తేదీ వరకు నాటుకోవాలి. స్వల్ప కాలిక రకం 120 నుంచి 125 రోజుల పంట కాలం కాగా జూలై చివరి వరకు నార్లు పోసుకొని 25 రోజుల నారుతో నాట్లు పూర్తి చేసుకోవాలి.
దీర్ఘకాలిక రకాలు :
● సాంబ మసూరి (బీపీటీ–5204)
ఈ వరి రకం వంగడం విత్తనాలు 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. చీడ పీడల నివారణ చర్యలు జాగ్రత్తగా తీసుకోవాలి. హెక్టారుకు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● ఇంద్రా (ఎంటీయూ–1061)
ఈ రకం వంగడం 160 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్విటాళ్ల దిగుబడి వస్తుంది.
మధ్యకాలిక రకాలు :
● కంపాసాగర్ వరి(కేపీఎస్–2874)
ఈ రకం వరి వంగడం 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులును కొంత మేర తట్టుకుంటుంది. హెక్టారుకు 65 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● సోమనాథ్
ఈ రకం వరి వంగడం130 నుంచి 135 రోజులకు పంట చేతికి వస్తుంది. సన్న రకం గింజ. నారు మడి దశలో చలిని తట్టుకుంటుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● వరంగల్ రైస్–1(డబ్ల్యూజీఎల్–915)
ఈ రకం వంగడం 135 రోజుల్లో పంట చేతికి అందుతుంది. వానాకాలం సాగుకు అనువైన ఉత్తమ రకం. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● తెలంగాణ వరి–2(డబ్ల్యూజీఎల్–697)
ఈ రకం వరి వంగడం పంటకాలం 135 రోజులు. సన్న గింజ రకం నాణ్యతతో ఉంటుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● ఆర్‌ఎన్‌ఆర్–11718((రాజేంద్ర నగర్ వరి–1)
135 నుంచి 140 రోజుల పంట కాలం. చౌడు, అగ్గి తెగులు, సుడి దోమ, ఎండు తెగులు, పోట్ట కుళ్లును తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది.
● జేజీఎల్–27356(జగిత్యాల వరి–3)
130 నుంచి 135 రోజులు పంట కాలం. అతి సన్న గింజ వరి రకం. హెక్టారుకు 70 నుంచి 75 క్విటాళ్ల దిగుబడినిస్తుంది.
● కేపీఎస్ – 10642 ( చిరు సంచి స్థాయి)
పంట కాలం 130 నుంచి 135 రోజులు. చౌడు నేలకు కొంత వరకు అనుకూలం. దిగుబడి ఎకరానికి 32 నుంచి 34 క్వింటాళ్లు వస్తుంది.
స్వల్పకాలిక రకాలు :
● తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్–15048)
పంట కాలం 125 రోజులు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకు 65 కింటాళ్ల దిగుబడి వస్తుంది.
● జగిత్యాల సన్నాలు(జేజీఎల్–1798)
ఈ రకం వంగడం పంటకాలం 120 రోజుల్లో చేతికి వస్తుంది. ఉల్లికోడును తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. హెక్టారుకు 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● తెలంగాణ వరి–4(జేజీఎల్–25958)
115 నుంచి 120 రోజులకు పంట కోత చేతికి వస్తుంది. హెక్టారుకు 65 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● జగిత్యాల రైస్(జేజీఎల్–24423).
120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఉల్లికోడు, సుడిదోమ, గోదుమ రంగు, ఆకుపచ్చ తెగులును కొంత మేర తట్టుకుంటుంది. హెక్టారుకు 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● బతుకమ్మ రకం
ఈ రకం వంగడం 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎండాకు తెగులు, సడిదోమ, పచ్చదోమ, తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● కూనారం వరి–2(కేఎన్‌ఎం–1638)
ఈ రకం వరి వంగడం120 నుంచి 125 రోజుల్లో పంట కోతకు వస్తుంది. హెక్టారుకు 76 నుంచి 85 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
● ఆర్‌ఎన్‌ఆర్–21278 (రాజేంద్ర నగర్ వరి–4)
115 నుంచి 118 రోజులు పంట కాలం. సన్న గింజ, పొట్టి గింజ రకం. హెక్టారుకు 60 నుంచి 70 క్విటాళ్ల దిగుబడినిస్తుంది.
● ఆర్‌ఎన్‌ఆర్–29325(రాజేంద్ర నగర్ వరి–5)
120 నుంచి 125 రోజులు పంట కాలం. సుడి దోమ, చౌడును తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్విటాళ్ల దిగుబడునిస్తుంది.
● కేఎన్‌ఎమ్–1638(కూనారం రవి–1)
125 నుంచి 130 రోజులు పంట కాలం. ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకు 70 నుంచి 80 క్విటాళ్ల దిగుబడి వస్తుంది.
● కేఎన్‌ఎమ్–118(కూనారం సన్నాలు)
125 రోజులు పంట కాలం. పంటపై గింజ రాలె శాతం తక్కువ. హెక్టారుకు 70 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగాం
కోఆర్డినేటర్ శ్రీనివాసరావు

వరిలో విత్తన ఎంపిక అత్యంత కీలకం

వరిలో విత్తన ఎంపిక అత్యంత కీలకం