ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి
రాజాపేట : ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని, భారత్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి అభయ్ పాటిల్ పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం రాజాపేటలో నిర్వహించిన గావ్ చలో.. బస్తీ చలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా వరకు స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాయివాలాను ప్రధానమంత్రిని చేసిన ఏకై క పార్టీ బీజేపీయేనన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానిక కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మేకల రమేష్, పట్టణ ఇంచార్జి కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, అధ్యక్షుడు సాధనబోయిన శంకర్, నాయకులు దాచపల్లి శ్రీను, జెన్న సిద్దులు, మధు, గొట్టి పాముల సాయికృష్ణ, దిడ్డి సత్యనారాయణ, ఉపేందర్, శ్రీహరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


