బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి
–జటంగి నర్సమ్మ, కేతేపల్లి
రూ.1,500 ఆదా అయ్యాయి
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బాగానే ఉన్నాయి. మా ఏరియా వారందరూ సన్నబియ్యం వండుకుని తింటున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం వల్ల మాకు బియ్యం కొనుగోలు చేయడం తప్పింది.దాదాపు రూ.1500 వరకు ఆదా అయ్యాయి.
– రమ్య, హుజూర్‌నగర్
బియ్యం బాగున్నాయి


