సివిల్ సప్లై కార్యాలయంలో కాల్ సెంటర్
సాక్షి,యాదాద్రి : ధాన్యం సేకరణలో సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి 92814 23621 నంబర్ అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలు, పౌర సరఫరాల శాఖ, రవాణా కాంట్రాక్టర్ల నుంచి ఒక ప్రతినిధిని నియమించారు. కాల్‌సెంటర్‌ను బుధవారం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కొనుగోళ్లు, రవాణా, చెల్లింపులు తదితర విషయాలపై ఎలాంటి సందేహాలున్నా కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని, ప్రతిపాదించిన 372 కేంద్రాల్లో 25 చోట్ల ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు వనజాత, రోజారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి నీలిమ పాల్గొన్నారు.
గుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు ఉద్యోగమేళా
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం కోకా కోలా కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థినుల కోసం ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఉద్యోగ మేళాలో పాల్గొనవచ్చన్నారు. వయో పరిమితి 18–24 సంవత్సరాలు, కనీస మార్కులు 60 శాతం ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సంవత్సరానికి రూ.3.50 లక్షల వేతనం, ఉచిత రవాణా, భోజన సౌకర్యం కంపెనీ కల్పిస్తుందని వివరించారు. ఒరిజినల్ పదో తరగతి, డిప్లొమో సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, 3 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు సెల్ నంబర్ 8919925381కు సంప్రదించాలని సూచించారు.
ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న సృజన
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌కు చెందిన కలువల సృజన ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించిన ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. సృజన ముద్ర లోన్ పొంది శారీ సెంటర్ పెట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తోంది. దీంతో ఆమెను ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ తరఫున ఆహ్వానించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారంలో భర్త సురేష్‌రెడ్డి ప్రోత్సాహంతో రాణించడం వల్ల తనకు ఈ పురస్కారం దక్కిందని చెప్పారు. సృజనను పలువురు అభినందించారు.
యాదగిరి క్షేత్రంలో జోడు సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్ర తిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. అదే విధంగా ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి ఆలయద్వార బంధనం చేశారు.
సివిల్ సప్లై కార్యాలయంలో కాల్ సెంటర్


