రిజిరస్టేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రిజిరస్టేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

Apr 9 2025 1:48 AM | Updated on Apr 9 2025 1:48 AM

రిజిరస్టేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

రిజిరస్టేషన్లకు స్లాట్‌ బుకింగ్‌

రేపటి నుంచి భువనగిరి, చౌటుప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు

చౌటుప్పల్‌: ఇళ్లు, ఇంటిస్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు గతంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరిగేవి. ఽగత ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూములు తహసీల్దార్‌ కార్యాలయాల్లో, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగేవి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షణ కొనసాగుతుండేది. ఈ పద్ధతికి స్వస్తి పలకడంతోపాటు సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ నూతనంగా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ప్రయోగాత్మకంగా 22 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ కార్యాలయాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో భువనగిరి, చౌటుప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కూడా ఉన్నాయి.

ప్రతిరోజు 48 స్లాట్లుగా విభజన

ఇప్పటివరకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో అత్యధిక డాక్యుమెంట్లు సమర్పిండంతో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ రోజువారీ పనివేళలను 48స్లాట్లుగా విభజించనున్నారు. ప్రజలు డాక్యుమెంట్‌ రైటర్లపై ఏమాత్రం ఆధారపడకుండా registration.tela ngana.gov.in వెబ్‌సైట్‌లో తమకు అనుకూలమైన తేదీ, రోజును ఎంచుకొని ఆ సమయానికి కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ స్లాట్‌ బుకింగ్‌ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్‌ పూర్తిగా 10– 15నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది.

స్లాట్‌ బుకింగ్‌ లేని ఐదు

డాక్యుమెంట్లకు అనుమతి

స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకోని 5 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్‌ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు వాక్‌ ఇన్‌ రిజిస్ట్రేషన్‌లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్‌లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.

ఇళ్లు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

ఆదేశాలు రావాల్సి ఉంది

స్లాట్‌ బుకింగ్‌కు సంబంధించి అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ విధానం క్రయవిక్రయదారులకు సులువుగా ఉంటుంది. వేగవంతమైన సేవలు అందుతాయి. చౌటుప్పల్‌ కార్యాలయంలో జరుగుతున్న సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మారేది కేవలం ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు జరగడమే.

– సందీప్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, చౌటుప్పల్‌

త్వరలోనే ఆధార్‌ ఈ– సంతకం

ప్రస్తుతం రిజిస్ట్రేషలన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసే వారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమయం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్‌ ఈ– సంతకం విధానాన్ని ప్రవేశపెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement