ఆప్ఘనిస్తాన్‌లో పేలుడు..ఇద్దరు పోలీసులు హతం​

Three Police Officers Killed   In Blast In Afghanistans Kandahar - Sakshi

కాబూల్‌ :  ఆప్ఘనిస్తాన్ దక్షిణ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రావిన్సు పరిధిలోని కందహార్‌లో  రోడ్‌సైడ్‌ బాంబును పోలీసు వాహనం ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ పేలుడు ఘటన వెనుక ఎవరున్నారన్న దానిపై ఆప్ఘనిస్తాన్ అధికారులు కానీ తాలిబన్‌ ఇస్టామిస్ట్‌ కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రాజకీయ పరిష్కార మార్గం దిశగా రెండు వైపులా చర్చలు కొనసాగుతున్నాయి. ఇకవైపు చర్చలు అంటూ శాంతియుతంగా మాట్లాడుతునే..మరోవైపు  దేశ వ్యాప్తంగా తాలిబన్‌ దాడులు చేస్తోంది. దీంతో ఆప్ఘనిస్తాన్‌ వ్యాప్తంగా పలు హింసాత్మక  ఘటనలు చోటుచేసుకుంటుండంతో భద్రతా దళాలు నిఘా ఉంచారు. (కాబూల్:యూనివర్సిటీపై ఉగ్రదాడి‌: 19 మంది మృతి)

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top