శ్రీ ఆంజనేయం | - | Sakshi
Sakshi News home page

శ్రీ ఆంజనేయం

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

శ్రీ ఆంజనేయం గుర్తుతెలియని మృతదేహం లభ్యం దివ్యాంగురాలిపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్‌

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): గురవాయిగూడెంలో వెలిసిన మద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారికి తమలపాకులతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాసనలు, నూతన వాహనాలకు పూజలు చేయించుకున్నారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.4,02,505 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. 5,100 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ జరిపినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ చందన తెలిపారు.

పాలకొల్లు సెంట్రల్‌: మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామం పరిధిలోని రాపాక కాలువలో సుమారు 45–50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. మంగళవారం కాలువలో లభించిన ఈ మృతదేహంపై బిస్కట్‌ కలర్‌ ఫుల్‌ హ్యాండ్‌ షర్ట్‌, నీలం రంగు ప్యాంటు ఉన్నట్లు వారు వెల్లడించారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే, వారు వెంటనే రూరల్‌ ఎస్సై నంబరు 94407 96669ను సంప్రదించాలని కోరారు.

పెంటపాడు: రావిపాడు గ్రామంలో దివ్యాంగ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి కోర్టు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పెన్నాడ నరసింహమూర్తి ఈ నెల 8న రావిపాడులోని మానసిక వికలాంగురాలైన బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దివ్యాంగ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై వెల్లడించారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ బాధితులు మంగళవారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాంతో పాటు భీమవరం అడిషనల్‌ ఎస్పీకి, డీఎస్పీకి వినతిపత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement