కుక్కునూరు: కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన 15 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మంగళవారం కుక్కునూరులో జరిగిన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా, కుక్కునూరుకు చెందిన విలాసాగరపు విశ్వనాథం కూడా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న ప్రజావ్యతిరేక పాలనపై అసంతృప్తితోనే పలువురు టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


