పరిషత్‌ పోరు షురూ | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పోరు షురూ

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

పరిషత్‌ పోరు షురూ

● సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయింపు ● జిల్లాలో 20జెడ్పీటీసీ, 20 ఎంపీపీ స్థానాలు ● 371 ఎంపీటీసీ స్థానాలు

సాక్షి, భీమవరం: జిల్లాలో స్థానిక సంస్థల (జిల్లా, మండల ప్రజాపరిషత్‌) ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఓటర్లు, జనాభా ప్రాతిపదికన సామాజికవర్గాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేశారు. జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం గత నెల 24వ తేదీతో ముగియగా, కొత్తగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవిని జనరల్‌ కేటగిరీకి రిజర్వు చేశారు. జిల్లాలోని భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలతో పాటు కొత్తగా కలిసిన గణపవరం మండలాన్ని కలుపుకుని మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 4 స్థానాలు కేటాయించగా, అందులో 2 మహిళలకు ఇచ్చారు. అలాగే బీసీలకు 6 స్థానాలకు గాను 3, జనరల్‌ కేటగిరీలోని 10 స్థానాలకు గాను 5 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఇదే తరహాలో ఎంపీపీ స్థానాలను కూడా సర్దుబాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement