జనరల్‌కే జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

జనరల్‌కే జెడ్పీ పీఠం

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

● ఏలూరు జనరల్‌ (మహిళ), పశ్చిమగోదావరి అన్‌రిజర్వ్‌డ్‌గా ఖరారు ● వారసుల అరంగేట్రానికి నేతలు సిద్ధం గడిచిన నాలుగు పర్యాయాల్లో..

న్యూస్‌రీల్‌

పునర్విభజన తర్వాతి స్వరూపం

బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ను ఏలూరు, పశ్చిమగోదావరి జెడ్పీలుగా విభజించారు. అయితే విభజన చెందిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి వీటిపైనే కేంద్రీకృతమైంది. ఏలూరు జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని జనరల్‌ (మహిళ)కు, పశ్చిమగోదావరి జెడ్పీని అన్‌రిజర్వ్‌ కేటగిరీకి కేటాయించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయ కోలాహలం మొదలైంది. రెండు జిల్లా పరిషత్‌లూ జనరల్‌ కేటగిరీకే దక్కడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాయి. తమ రాజకీయ వారసులను బరిలోకి దించేందుకు ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు జనరల్‌ కేటగిరీ లభించడంతో ఆశావహుల మధ్య గట్టి పోటీ నెలకొంది.

90 ఏళ్ల చరిత్ర.. ఎస్టీలకు అందని ద్రాక్షే

1936లో జిల్లా బోర్డుగా ఏర్పడిన పశ్చిమగోదావరి, 1959లో జిల్లా పరిషత్‌గా రూపాంతరం చెందింది. తొమ్మిది పదుల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ జెడ్పీలో చైర్మన్‌ పీఠం ఓపెన్‌ కేటగిరీ మొదలుకొని ఎస్సీ రిజర్వేషన్‌ వరకు అనేక వర్గాలకు దక్కింది. అయితే, చైర్మన్‌ ఎంపిక స్టేట్‌ యూనిట్‌గా, రోస్టర్‌ విధానంలో జరుగుతుండడంతో ఇప్పటివరకు ఎస్టీ వర్గానికి ఒక్కసారి కూడా అవకాశం దక్కక పోవడం గమనార్హం. ఆ ఉమ్మడి పశ్చిమ జెడ్పీ పరిధిలోని 47 జెడ్పీటీసీ స్థానాల్లో 5 ఎస్టీ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి చెందిన జీలుగుమిల్లి, కుక్కునూరు, బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం జెడ్పీటీసీ స్థానాలు ఇప్పటికీ ఎస్టీలకే కేటాయించారు. అయితే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానం మాత్రం గిరిజన వర్గానికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

జిల్లాల పునర్విభజన ప్రక్రియ తర్వాత స్థానాల సంఖ్యలో గణనీయమైన మార్పులు వచ్చాయి ఏలూరు జిల్లా పరిషత్‌: మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలతో ఏర్పాటైంది. ఇందులో కొత్తగా కై కలూరు, నూజివీడు నియోజకవర్గాలు కలిశాయి. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌: 7 నియోజకవర్గాల పరిధిలోని 20 జెడ్పీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్న గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి.

ఏఐ సృష్టించిన చిత్రం

నిధులతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి వ్యాప్తంగా జిల్లా పరిషత్‌కు ఆస్తులు అధికంగా ఉన్నాయి. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ప్రతి ఎన్నికల్లో బలమైన పోటీ కొనసాగుతుంది. 2001లో ఎస్సీ జనరల్‌ కేటగిరిలో కొక్కిరగడ్డ జయరాజు జడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. ఆ తరువాత 2006లో బీసీ జనరల్‌ స్థానం నుంచి మాజీ మంత్రి, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత 2009లో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఆ తరువాత 2014లో ముళ్లపూడి బాపిరాజులు పని చేశారు. 2021 నుంచి 2023 వరకు ప్రస్తుత ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కవురు శ్రీనివాస్‌ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి చివరి చైర్మన్‌గా 2023–2026 వరకు గంటా పద్మశ్రీ ప్రసాద్‌ పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement