జిల్లా రెడ్‌క్రాస్‌కు ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

జిల్లా రెడ్‌క్రాస్‌కు ప్రథమ బహుమతి

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

జిల్లా రెడ్‌క్రాస్‌కు ప్రథమ బహుమతి ఆకివీడు సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్‌ నియామకం నేడు పింఛన్ల పంపిణీ భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తికి చర్యలు రోడ్డు మరమ్మతుల్లో నిర్లక్ష్యం సహించం

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలకుగా ను రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి గోల్డ్‌మెడల్‌ అందుకోనున్నారు. 2024–25లో జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవల విస్తరణ తదితర కార్యక్రమాలకు సహకరించిన అప్పటి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి కూడా గోల్డ్‌మెడల్‌ లభించింది. అలాగే ప్రతిష్టాత్మక అవార్డును జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఎంఎస్‌వీఎస్‌ భద్రిరాజు అందుకోనున్నారు. ముఖ్యంగా బ్లడ్‌ సెంటర్‌, తలసేమియా సెంటర్‌, మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ వంటి కీలక సేవా ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు జిల్లా రెడ్‌క్రాస్‌ కమిటీ పేర్కొంది.

ఆకివీడు : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీ హెచ్‌సీ)లో గైనకాలజిస్ట్‌, ప్రసూతి వైద్యసేవలను పునః ప్రారంభించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విక్రమ్‌ తెలిపారు. గత నెల 27న ‘సీహెచ్‌సీలో వైద్యుల కొరతతో ఇక్కటు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి గైనకాలజిస్ట్‌ను నియమించారన్నారు. కై కలూరు నుంచి డాక్టర్‌ సునీత ప్రతి బుధ, శుక్రవారాల్లో ఇక్కడ సే వలందిస్తారన్నారు. రానున్న రోజుల్లో ఆమె సే వల్ని రోజువారీగా వినియోగించుకుంటామని చెప్పారు. త్వరలో ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న మిగిలిన వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుందన్నారు.

భీమవరం(ప్రకాశంచౌక్‌) : జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. మంగళవారం సీఎం చంద్రబాబు చేతులమీదుగా నరసాపురంలో పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 2,19,625 మంది లబ్ధిదారులకు రూ.95,21,34,000 పింఛఉ్ల అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ సో మవారం సచివాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మాట్లాడుతూ చింతలపూడి మండలంలోని రేచర్ల, శెట్టివారిగూడెంలలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి ప్రాజెక్ట్‌ కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై అవసరమైన భూసేకరణ, మౌ లిక వసతులు, విద్యుత్‌, నీటివసతి, రహదారులు, పర్యావరణ అనుమతులు, భద్రతా ప్ర మాణాలు తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీనిపై సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి.వినూత్న, జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్‌ మేనేజర్‌ బాబ్జి పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రహదారి నిర్మాణం, మరమ్మతుల సమయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌తో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెట్రిసెల్వి మా ట్లాడుతూ ఉంగుటూరు–బాదంపూడి మధ్య జాతీయ రహదారిపై మరమ్మతుల సమయంలో సరైన సైన్‌, హెచ్చరిక బోర్డులు లేని కారణంగా ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడని, సదరు కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని చెప్పారు.

రహ్‌ వీర్‌పై అవగాహన

రహ్‌వీర్‌ పథకంపై విస్తత అవగాహన కలిగించాలని కలెక్టర్‌ తెలిపారు. బాధితుడిని ప్ర మాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి చేర్చి కాపాడే వారికి రహ్‌ వీర్‌ పథకం కింద రూ.25 వేల బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తా మన్నారు. ఎస్పీ కేపీ శివకిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement