తాడేపల్లిగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం పి లుపునిచ్చారు, సోమవారం సవితృపేట క్యాంపు కా ర్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీని సమన్వయంతో మరింత బలోపేతం చేసుకోవాలని, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఐక్యంగా శ్రేణులు ముందుకు సాగితే విజయానికి ఢోకా లేదన్నారు. పార్టీ జెండా కచ్చితంగా ఎగిరేలా పనిచేద్దామన్నారు. ము న్సిపల్ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలు నేరుగా జరుగుతా యంటున్నారన్నారు. ప్రజల్లో నుంచి జరిగే ఎన్నిక లు కావడంతో తప్పకుండా విజయం సాధిస్తామని, అందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ శ్రేణులకు అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తా మన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా సహకారం అందించేందుకు 50 మందితో బలమైన టీమ్ సిద్ధంగా ఉందన్నారు. తాడేపల్లిగూడెంలో మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. సీనియర్ నాయకులు గుండుమోగుల బలుసులరావు, గుండుబోగుల నాగు, రాజా త్రినాథ్, వెలనాటి సత్తిబాబు, పట్టణ కమిటీ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాసు, 35 వార్డుల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.


