ఆకివీడు : వర్షాలకు, వరదలకు ఎగువ ప్రాంతం నుండి చొచ్చుకువస్తున్న నీటిని పంట కాలువల్లోకి వదులుతున్నారు. ఇలా ఎర్రకాలువ నుంచి వచ్చే బురద రంగు నీరు స్థానిక వెంకయ్య వ య్యేరు పంట కాలువలోకి చేరింది. పంట కా లువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాలువలో అదనపు నీరు ఓల్డ్ వయ్యేరు కాలువ, చినకాపవరం లాకులు ఎత్తివేసి ఉప్పుటేరులోకి వది లివేస్తున్నారు. ఇలా పలు మీడియం, మైనర్ కా లువల్లోకి కూడా ఎర్రనీరు ప్రవేశించింది. పలు వాగుల నుంచి చొచ్చుకువస్తున్న ఎర్రనీటి ప్ర వాహం ఉధృతంగా ఉంటే కొల్లేరు, ఉప్పుటేరు నీటిమట్టాలు పెరిగే ప్రమాదం ఉంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం అందించాలని ఏలూరు క లెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో భాగంగా 403 అర్జీలు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని..
● టి.నరసాపురం మండలం మెట్టగూడేనికి చెందిన కుప్పాల సూర్యనారాయణ తన భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేశారు.
● జంగారెడ్డిగూడేనికి చెందిన కుంచె సీతా లావణ్య ఆస్తిని కుమారుడు రాయించుకుని తనను చూడటం లేదని వాపోయారు.


