● మన్యంలో కంటైనర్‌ హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

● మన్యంలో కంటైనర్‌ హౌస్‌

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

● మన్యంలో కంటైనర్‌ హౌస్‌

మన్యంలో కంటైనర్‌ హౌస్‌ పరిసర ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటోంది. బుట్టాయగూడెంకు చెందిన కరాటం టెముజిన్‌ అనే రైతు తన వ్యవసాయ భూమిలో ఈ కంటైనర్‌ హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఓడల తయారీకి ఉపయోగించే అత్యంత దృఢమైన ఇనుప రేకులు, సామాగ్రితో ఈ ఇంటిని నిర్మించారు. బయటకు ఇనుప కంటైనర్‌లా కనిపించే ఈ ఇల్లు లోపల ఒక స్టార్‌ హోటల్‌ను తలపిస్తుంది. గదిలోపల విలాసవంతమైన ఏసీ, ఖరీదైన ఫర్నీచర్‌, ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. తన పొలం దగ్గరకు వచ్చే అతిథులు, స్నేహితుల కోసం సుమారు రూ.9 లక్షల ఖర్చుతో అతిథి గృహంగా నిర్మించినట్లు టెముజిన్‌ తెలిపారు. – బుట్టాయగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement