కొల్లేరుకు ఏదీ అభయం ? | - | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు ఏదీ అభయం ?

Aug 31 2026 1:38 AM | Updated on Aug 31 2026 1:38 AM

కొల్లేరుకు ఏదీ అభయం ? కేసులు నమోదు చేస్తున్నాం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు అభయారణ్యానికి ఆక్రమణల చెర వీడటంలేదు. అక్రమంగా తవ్విన చెరువుల్లో చేపలసాగు నిరాటంకంగా కొనసాగుతోంది. ఒకవైపు ఆక్రమణలను ధ్వంసం చేస్తున్నా.. ఆక్రమణదారులు మళ్లీ చెరువు గట్లకు మరమ్మతులు చేసుకుని చేపల సాగు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అండతో ఆక్రమణదారులు ధీమాగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ) కొల్లేరు కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. అభయారణ్యంలో అక్రమ చెరువులను ధ్వంసం చేసే ప్రక్రియలో అటవీశాఖ సిబ్బందికి కలెక్టర్‌ పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. కొల్లేరు అ భయారణ్యంలో 20 వేల ఎకరాలను మినహాయించాలని ఏపీ ప్రభుత్వం కోరినా ఆక్రమణలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఏర్పడిన సహజసిద్ధ సరస్సు కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,600 ఎకరాలు. రామ్‌సర్‌ సదస్సు ద్వారా కొల్లేరు అభయారణ్యాన్ని ఐదో కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలుగా నిర్ణయించారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ అభయా రణ్యంలో అక్రమ చేపల చెరువులు వెలిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో 43 వేల ఎకరాల విస్తీర్ణంలో అక్రమ చేపల చెరువులను ప్రభుత్వం ధ్వంసం చేసింది. ప్రస్తుతం అభయారణ్య పరిధిలో ఆక్రమణలపర్వం మరింత ఊపందుకుంది. కొల్లేరులో 17,771 ఎకరాల్లో మళ్లీ ఆక్రమణలు జరిగాయని ఇటీవల ఎన్జీటీ ముందు అటవీశాఖ అంగీకరించింది.

ప్రజల్ని రెచ్చగొడుతున్న అధికార పార్టీ నేతలు

అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన సీఈసీ గతనెల 17న కలెక్టర్‌ను, ఏపీ ప్రభు త్వాన్ని ఆదేశించింది. అటవీశాఖకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని నిర్దేశించింది. అధికారులు చెరువుల ధ్వంసానికి వెళితే అధికార పార్టీ నేతలు కొల్లేరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. దీంతో అధికారులు తూతూ మంత్రంగా చెరువు గట్లు ధ్వంసం చేస్తున్నారు. మండవల్లి మండలం పెనుమాకలంక, భీమడోలు మండలం ఆగడాలలంక, కై కలూరు మండలం పందిరిపల్లిగూడెం, చటా కాయి ఇలా పలు ప్రాంతాల్లో చెరువులను అటవీశాఖ ధ్వంసం చేసినా.. మళ్లీ వాటిలో సాగు జరుగుతోంది. కొల్లేరు ప్రాంత ఎమ్మెల్యేలు జిరాయితీ, సొసైటీ భూములను మినహాయిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కొల్లేరు సమీపంలోని కలిదిండిలో పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు కొల్లేరు భూముల గురించి మాత్రం మాట్లాడలేదు. అధికార పార్టీల అండదండలు ఉన్నవారే అక్రమ సాగును చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.

1.61 లక్షల ఎకరాల ఆక్రమణ

కొల్లేరుకు సంబంధించిన మొత్తం 2.22 లక్షల ఎ కరాల విస్తీర్ణంలో (కాంటూర్‌ 5 వరకు) ఏకంగా 1.61 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు జా తీయ నీటిసంరక్షణ సంస్థ జలబీరా ఇటీవల ఒక నివేదికలో తెలిపింది. పర్యావరణవేత్త రాజేంద్రసింగ్‌ నాయకత్వంలో పనిచేసే ఈ సంస్థ కొల్లేరుపై అధ్యయనం చేసింది. సరస్సులో పెరిగిపోతున్న తీ వ్రమైన ఆక్రమణలు, పర్యావరణ విధ్వంసాన్ని ఎండగడుతూ నివేదికను బహిర్గతం చేసింది. కొల్లేరు లో ప్రస్తుతం 61,600 ఎకరాలు మాత్రమే అసలైన వెట్‌ల్యాండ్‌ (చిత్తడినేల) రూపంలో మిగిలి ఉందని తెలిపింది. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. జలబీరా జాతీయ కన్వీనర్‌ బొలిశెట్టి సత్యనారాయ ణ ఇటీవల ఈ నివేదిక బయటపెట్టారు.

కొల్లేరు సరస్సు మొత్తం విస్తీర్ణం – 2,22,600 ఎకరాలు

అభయారణ్యంగా గుర్తించిన ప్రాంతం – 77,138 ఎకరాలు

కొల్లేరు అభయారణ్యంలో ప్రస్తుతం ఆక్రమణలకు గురైంది – సుమారు 6,000 ఎకరాలు

కొల్లేరును ఆక్రమించి తవ్విన చెరువులు సంఖ్య – 1,000కి పైన

అటవీశాఖ ధ్వంసం చేసినట్లు చెబుతున్న విస్తీర్ణం – 5,000 ఎకరాలు

అటవీశాఖ అంగీకరించిన మేరకు అక్రమ చెరువుల విస్తీర్ణం – 17,771 ఎకరాలు

కొల్లేరు అభయారణ్యంలో అక్రమ సాగు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో చెరువులో చేపలు పట్టుకునే అవకాశం ఇచ్చి తర్వాత గట్లు ధ్వంసం చేస్తున్నాం. ఇటీవల మండవల్లి మండలం పెనుమాకలంకలో ధ్వంసం చేసిన గట్లను పూడ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొల్లేరు ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం.

– కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్‌, కై కలూరు

కొల్లేరు అభయారణ్యంలో యథేచ్ఛగా చేపల సాగు

వేలాది ఎకరాల చెరువులు ధ్వంసం.. మళ్లీ ఆక్రమణలు

17,771 ఎకరాల్లో మళ్లీ ఆక్రమణలు జరిగాయని అంగీకరించిన అటవీశాఖ

అధికార పార్టీ నేతల అండతో చెలరేగిపోతున్న అక్రమార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement