అనుమతులతో పనేంటి.. నిబంధనలతో మాకేంటి? | - | Sakshi
Sakshi News home page

అనుమతులతో పనేంటి.. నిబంధనలతో మాకేంటి?

Aug 31 2026 1:38 AM | Updated on Aug 31 2026 1:38 AM

చర్యలు తీసుకుంటున్నాం

భీమవరం, తాడేపల్లిగూడెంలో దాడులు

భీమవరం (ప్రకాశం చౌక్‌) : జిల్లాలో ప్రభుత్వ అను మతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా నడుస్తున్న అనధికార డెంటల్‌ క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫిజియోథెరపీ కేంద్రాల బాగోతం వైద్యారోగ్య శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అనుమతులు అవసరం లేదు.. ని బంధనలు పాటించాల్సిన పనేలేదు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్న వైద్య కేంద్రాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు తదితర ప్రధాన పట్టణాల్లో ఎలాంటి పత్రాలు లేకుండా, కాలం చెల్లిన లైసెన్సులతోనే కొందరు వైద్యులు వ్యాపారం సాగిస్తున్నారు. అర్హత లేని సిబ్బందితో వైద్యం చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే రీతిలో వైద్య సేవలు అందిస్తున్న కేంద్రాలు ఉన్నాయని, వాటిపైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమాల తీరిలా..

అర్హత లేని సిబ్బంది: డెంటల్‌ క్లినిక్‌లు, ఫిజియోథెరపీ కేంద్రాలు, ల్యాబ్‌లలో కనీస అర్హత లేని ఇంటర్‌, డిగ్రీ చదివిన సాధారణ సిబ్బందిని పెట్టి పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నారు.

కమీషన్‌ దందా: ఎంబీబీఎస్‌, ఆర్‌ఎంపీ డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా బెడ్లు ఏర్పాటు చేసి, తాము సూచించిన నిర్దిష్ట మెడికల్‌ షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాలని రోగులపై ఒత్తిడి తెస్తూ కమీషన్‌ వ్యాపారం చేస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీలు ఆపరేషన్లు చేసి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. కొన్ని కేసులపై బాధితులు కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదులు కూడా చేశారు.

అధికారుల నిర్లక్ష్యం : జిల్లాలో ఏళ్ల తరబడి ఈ అక్రమ దందా వ్యాపారాలు జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ అధికారులకు ఇప్పటివరకు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సమ గ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ తనిఖీలు చేసే వరకూ ఈ విషయం బయటపడలేదు. జిల్లాలో అన్‌ రిజిస్ట్రార్‌ ల్యాబ్‌లు పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం.

యథేచ్ఛగా డెంటల్‌ క్లినిక్‌లు, ల్యాబ్‌ల నిర్వహణ

రిజిస్ట్రేషన్‌ లేకుండానే వైద్యం

జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారుల దాడులు

బయటపడుతున్న అనధికార క్లినిక్‌లు

జిల్లాలో రిజిస్ట్రేషన్‌ లేకుండా నడుపుతున్న డెంటల్‌ ఆస్పత్రులు, డెంటల్‌ క్లినిక్‌లు, ల్యా బ్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లకు నోటీసులు జారీ చేస్తున్నాం. ఎలాంటి అనుమతులు లేకుంటే సీజ్‌ చేస్తాం. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి అనధికార వైద్య సేవలు, ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వా రిపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా అనధికార వైద్యసేవలు, ల్యాబ్‌లు నిర్వహిస్తున్న ట్టు అనుమానం ఉంటే మా దృష్టికి తీసువస్తే వాటిని పరిశీలిస్తాం.

– ఎం.రవిబాబు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ

ఇన్‌చార్జ్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన వరుస తనిఖీల్లో సుమారు 10కి పైగా అనధికార కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఎలాంటి అనుమతులు లేని కిశోర్‌ డెంటల్‌ ఆస్పత్రి, కేకే డెంటల్‌ ఆస్పత్రి, అభి డెంటల్‌ క్లినిక్‌లను అధికారులు గుర్తించారు. తాడేపల్లిగూడెంలో రెన్యూవల్‌ చేసుకోని శ్రీవరలక్ష్మి నర్సింగ్‌ హోమ్‌, కల్యాణ, జగదాంబ ఫిజియోథెరపీ కేంద్రాలతో పాటు, ఆర్‌ఆర్‌ డెంటల్‌ ల్యాబ్‌, మిత్ర డెంటల్‌ ఆస్పత్రి, దొరశ్రీ ఫిజియోథెరపీ సెంటర్‌, సాయి చంద్ర ల్యాబ్‌లను గుర్తించి సుమారు ఐదేళ్లుగా ఇవి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement