ముందు పార్టీ.. తర్వాతే కూటమి! | - | Sakshi
Sakshi News home page

ముందు పార్టీ.. తర్వాతే కూటమి!

Aug 31 2026 1:38 AM | Updated on Aug 31 2026 1:38 AM

రాజీపడే ప్రస్తకే లేదంటూ..

తాడేపల్లిగూడెం : మున్సిపల్‌ ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. న్యాయపరమైన వ్యాజ్యాల నేపథ్యంలో విలీన గ్రామాల పంచాయితీ సమస్యల పరిష్కారమయ్యేవరకూ ఏమవుతుందో ప్రశ్నార్థకమే. ఈలోపు తాడేపల్లిగూడెంలో కూటమి సెగ మొదలైంది. కూటమికి చెందిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు ప్రభుత్వ విప్‌గా ఉన్న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన అనుబంధం ఉప్పూనిప్పూలా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల అనధికార సమాచారం కూటమిలో వేడి రాజేసింది.

ఎవరికి వారే..

ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌ (జనసేన), భవన నిర్మాణ కార్మికుల, ఇతర కార్మికుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న వలవల బాబ్జీ (టీడీపీ) వేదిక కూడా పంచుకోవడం లేదు. విధానపరమైన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. రెండు క్యాంపులు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఇస్తున్నాయి. టీడీపీలో ఉంటూ జనసేన అభిమానవర్గంగా సుబ్బరాజు, ధర్మేంద్ర, గిరి, రామ్‌ లక్ష్మణులు వంటి వారు కొనసాగుతున్నారు. టీడీపీ ‘జే’ వర్గంగా వీరిని అభివర్ణిస్తున్నారు.

1న తేలనున్న ‘పంచాయితీ’

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఎల్‌.అగ్రహారం, కొండ్రుపోలు, ప్రత్తిపాడు, పడాల తదితర గ్రామాల విలీనానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కిన పంచాయతీ వ్యవహారం సెప్టెంబర్‌ 1న తేలే అవకాశం ఉంది. అదేరోజు హైకోర్టులో వాయిదా ఉండటంతో విషయం ఏమవుతాదనే ఉత్కంఠ ఉంది.

‘మొదట పార్టీ తర్వాతే కూటమి’ అని వలవల బాబ్జీ ఇటీవల కుండబద్ధలు కొట్టారు. పెంటపాడు మండలం మౌంజిపాడులో కూటమి ఆత్మీయ విందుకు ఎమ్మెల్యే హాజరైనా, బాబ్జీతో సహా టీ డీపీ శ్రేణులెవ్వరూ రాలేదు. ‘ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశాం.. ఏఎంసీ చైర్మన్‌ పదవినీ వదులుకున్నాం.. మున్సిపల్‌ చై ర్మన్‌ పదవి టీడీపీకి కా వాలని ఆశిస్తున్నాం.. అధి ష్టానం కూడా ఆలోచిస్తుంది..’ ఈసారి తగ్గేదేలా అన్నట్టుగా టీడీపీ వైఖరి ఉంది. ఈ విషయంలో రాజీపడే ధోరణి టీడీపీలో కనిపించడం లేదు. నియోజకవర్గ కన్వీ నర్‌గా ఉన్న బాబ్జీ ఈ దిశగా పావులు కదుపుతున్నారు. టీడీపీ శ్రేణులు మున్సిపల్‌ పోరుకు సమాయత్తమవుతున్నాయి. జనసే న విషయానికొస్తే ‘గూడెంలో అధికారం మనది.. మన్నలి ఎవరూ ఆపలేరు’ అన్న రీతిలో ఉంది. ఎన్నికలు జరిగితే జనసేన కూడా రాజీపడే ధోరణిలో లేదు. అక్కడ ఆశావహుల జాబితా చాలానే కనిపిస్తోంది. దీంతో కూటమిలో వార్‌ టూ సైడ్స్‌ గా మారింది.

పుర పోరులో పోటీకి తగ్గేదేలే

జనసేన, టీడీపీ వేరు కుంపట్లు!

మేమంటే.. మేమంటూ సన్నాహాలు

గూడెం కూటమిలో మరోసారి రాజుకున్న అగ్గి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement