రకీడాకారుల ఆకలి కేకలు
జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ద్వారా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు పోషకాహారం కోసం ఎదురుచూస్తున్నారు. 8లో u
ద్వారకాతిరుమల: ఈదురు గాలులు గురువారం మధ్యాహ్నం బీభత్సాన్ని సృష్టించాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో పలు గ్రామాల్లోని మామిడి తోటలు అతలాకుతలం అయ్యాయి. కోతకొచ్చిన మామిడి కాయలు నేలరాలడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. రాళ్లకుంట, సత్తెన్నగూడెం గ్రామాల్లోని తోటల్లో పెద్ద ఎత్తున మామిడి కాయలు రాలిపోయాయి. వర్షం వెలసిన తరువాత తోటల్లోకి వెళ్లిన రైతులు నేలరాలిన కాయలను చూసి లబోదిబోమన్నారు. ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రాళ్లకుంటలో తన ఒక్క తోటలోనే చెరుకు రసాలు, బంగినపల్లి, చిన్న రసాల కాయలు 800కు పైగా రాలిపోయాయని కౌలు రైతు మారుబోయిన సత్యన్నారాయణకు తెలిపాడు. అకాల వర్షం తమను నట్టేట ముంచిందని ఆవేదన చెందారు.
వర్షం రాకతో భక్తుల పరుగులు
శ్రీవారి క్షేత్రంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు ఆలయ గోపురాల్లోకి పరుగులు తీశారు. గత కొద్ది రోజులుగా వేసవి ఎండలు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరైన భక్తులు వర్షపు చల్లదనంతో సేదతీరారు.


