పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయస్వామి వారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం సుప్రభాత సేవ, అర్చనతో ప్రారంభమయ్యాయి. ఉదయం 6గంటలకు దాతల గోత్రనామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఏడు గంటలకు 1008 గులాబి పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమం, ఉదయం 9 గంటలకు దాసాంజనేయ భజన సమాజం రేమల్లే వారితో 108సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. సాయంత్రం 4గంటలకు దాసాంజనేయ భజన సమాజంతో రేమల్లె వారితో 108 సార్లు హనుమాన్ చాలీసా పారారాయణ చేశారు. సాయంత్రం 6గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ నక్షత్రహారతి నిర్వహించారు. అనంతరం నీలకంఠేశ్వర నృత్య కళాక్షేత్రం వారితో ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పూలరంగడు హాస్య నాటకం ప్రదర్శించారు. రాత్రి 9 గంటలకు పౌరాణిక నాటకాలు ప్రదర్శన చేశారు.


