పాలిసెట్‌లో సెంట్‌ ఆన్స్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో సెంట్‌ ఆన్స్‌ ప్రతిభ

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

పాలిసెట్‌లో సెంట్‌ ఆన్స్‌ ప్రతిభ ప్రతిభావంతులకు పురస్కారాలు

తాడేపల్లిగూడెం: పట్టణంలోని సెంట్‌ ఆన్స్‌ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పాలిసెట్‌లో రాష్ట్ర ర్యాంకులు సాధించినట్టు ఆ విద్యాసంస్థ చైర్మన్‌ అద్దంకి విజయకుమార్‌ తెలిపారు. బి.సిద్ధాంత్‌ స్టేట్‌ 114వ ర్యాంకు, ఎం.ఆల్ప్రెడ్‌ బెన్నీ 406వ ర్యాంకు, జి.యశ్వంత్‌ 593వ ర్యాంకు సాధించారన్నారు. ఈ సంరద్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు.

ఏలూరు టౌన్‌: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కష్టపడాలని ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ అన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన ఏలూరు సురేష్‌చంద్ర బహుగుణ పోలీస్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులకు బుధవారం ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ బహుమతులు, పురస్కారాలు అందజేశారు. విద్యార్థులు జే.లేఖశ్రీవల్లీకి రూ.25వేలు, బీ.జ్యోతిక గణేశ్వరికి రూ.15 వేలు, కే.హర్షవర్థినికి రూ.10వేలు నగదు బహుమతులు అందజేశారు. అలాగే మరికొందరు విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. ఆర్‌ఐ సతీష్‌కుమార్‌, స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు స్రవంతి, ఆర్‌ఎస్‌ఐ నరేంద్ర, ప్రసాద్‌ నాయక్‌, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement