ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా ఏపీటీఎఫ్ (1938) నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. స్థానిక పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఈ ఎంపిక నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఈ.రామ్మోహన్ అధ్యక్షత వహించగా, కె.శేషగిరి, బి.లంకేశ్వరరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
సంఘ నూతన జిల్లా అధ్యక్షుడిగా పీ శ్రీనివాస్ (పోలవరం), ప్రధాన కార్యదర్శిగా జీ మోహన్ (ఏలూరు), గౌరవాధ్యక్షుడిగా గంధం రాంబాబు (చింతలపూడి) ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ అధ్యక్షుడిగా ఈ. రామ్మోహన్, ఉపాధ్యక్షులుగా ఆర్డీవీ ప్రసాద్, ఎస్వీ దుర్గారావు, డీ. శ్రీనివాసరావు, జీ రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అదనపు కార్యదర్శులుగా పీ నాగరాజు, జీ రాజు, ఎం కృష్ణమూర్తి, జీ శ్రీనివాసరావు కార్యదర్శులుగా జీ వెంకటరమణ, రాహుల్, కే శ్రీనివాసరావు, కే రఘురామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రకటించారు. రాజీలేని పోరాటాల ద్వారా ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుస్తామని, సంఘాన్ని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ కమిటీ కన్వీనర్ జి. కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.


