ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

May 6 2026 9:01 AM | Updated on May 6 2026 9:01 AM

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

గణపవరం: జిల్లాలో రబీ ధాన్యం సేకరణ వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం గణపవరం తహసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పి.ధర్మరాజుతో కలిసి ఆయన వివిధ శాఖల జిల్లా ఉన్నతాఽధికారులు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గోనెసంచుల కొరత లేకుండా తక్షణం 2..5 లక్షల గోనెసంచులు బుధవారం నాటికి అందుబాటులో ఉంచాలని రైస్‌మిల్లర్లను ఆదేశించారు. గణపవరం మండలంలోని మొయ్యేరు, పిప్పర, ముప్పర్తిపాడు తదితర గ్రామాలలో కొందరు రైతులు పీఆర్‌ 126 రకం వరిసాగుచేశారని, ఆ ధాన్యం కొనడానికి రైస్‌మిల్లర్లు నిరాకరిస్తున్నట్లు రైతులనుంచి తమకు ఫిర్యాదులు అందాయని జేసీ రాహుల్‌కుమార్‌, ఎంఎల్‌ఏ ధర్మరాజు అన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రకం ధాన్యం కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ జేడీ జెడ్‌.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార అధికారి సంకు మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement